టీమిండియా ఓపెనర్ సంజు శాంసన్‌పై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పవర్‌ప్లేలో బౌండరీలు కొట్టే క్రమంలో అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ, ఆ రిస్క్ తీసుకోకపోతే జట్టు స్కోరు వేగంగా పెరగదు. అందుకే ‘సంజూని నిందించలేం’ అని పేర్కొన్నాడు. ఫీల్డింగ్ గ్యాప్స్‌ను వాడుకోవడమే అతని ప్రధాన ఉద్దేశమని అభిప్రాయపడ్డాడు.