JGL: కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని అదనపు కలెక్టర్ బీఎస్ లత అన్నారు. జగిత్యాల రూరల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు వేగవంతం చేయాలని సూచించారు. హమాలీలు, లారీలు తగిన సంఖ్యలో అందుబాటులో ఉంచాలని తెలిపారు. ధాన్యం నాణ్యత, తేమ శాతాన్ని పరిశీలించారు.