HYD: మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి, పీర్జాదిగూడలో ప్రధాన రహదారులు గుంతలమయంగా మారడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారం కోరుతూ పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి డిప్యూటీ కమిషనర్ ఏ. శైలజకు వినతిపత్రం అందజేశారు. వెంటనే ప్యాచ్ వర్క్ పనులు చేపట్టాలని డిప్యూటీ కమిషనర్ తెలిపారు.