intintiki telugudesam:తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ (tdp) జాడ లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్‌లో కీ రోల్ పోషిస్తోన్న.. తెలంగాణలో మాత్రం ప్రభావం లేదు. పార్టీ నుంచి ముఖ్య నేతలు వెళ్లిపోయారు. ఇటీవల కాసాని జ్ఞానేశ్వర్‌కు (kasani gnaneshwar) తెలంగాణ టీడీపీ పగ్గాలను చంద్రబాబు (chandrababu) అప్పగించిన సంగతి తెలిసిందే. దీంతో టీడీపీకి తెలంగాణలో పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కాసాని (kasani) వ్యుహారచన చేశారు.
tomorrow intintiki telugudesam conducted in telangana
intintiki telugudesam:తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ (tdp) జాడ లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్‌లో కీ రోల్ పోషిస్తోన్న.. తెలంగాణలో మాత్రం ప్రభావం లేదు. పార్టీ నుంచి ముఖ్య నేతలు వెళ్లిపోయారు. ఇటీవల కాసాని జ్ఞానేశ్వర్‌కు (kasani gnaneshwar) తెలంగాణ టీడీపీ పగ్గాలను చంద్రబాబు (chandrababu) అప్పగించిన సంగతి తెలిసిందే. దీంతో టీడీపీకి తెలంగాణలో పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కాసాని (kasani) వ్యుహారచన చేశారు. రేపటి నుంచి ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం చేపడతామని తెలిపారు. యువత, మహిళ, విద్యావంతులకు పెద్దపీట వేస్తామని కాసాని జ్ఞానేశ్వర్ (kasani gnaneshwar) ప్రకటించారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ఎన్టీఆర్ భవన్లో పార్టీ అధినేత చంద్రబాబు (chandrababu) ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో గల తన నివాసంలో ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.
రాష్ట్రంలో పది రోజులపాటు ఈ కార్యక్రమం ఉంటుందని కాసాని జ్ఞానేశ్వర్ (kasani gnaneshwar) తెలిపారు. మండలం యూనిట్‌గా తీసుకుంటామని వివరించారు. అన్ని పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో డివిజన్ల వారీగా కొనసాగుతుందని చెప్పారు. ఆ ఇంట్లో కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేసుకుంటూ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా చేపడతామన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని డివిజన్లలో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఆనాడు ఎన్టీఆర్ (ntr), చంద్రబాబు (chandrababu) హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజలకు వివరిస్తామని స్పష్టం చేశారు.
కిలో రూ.2 బియ్యం పథకం, పట్వారీ, పటేల్ వ్యవస్థ రద్దు, మహిళలకు ఆస్తి హక్కు, బీసీ వర్గాలకు పెద్దపీట వంటి అంశాలు వివరిస్తామని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం కోసం సలహాలు, సూచనలు స్వీకరిస్తామని వివరించారు. పది రోజుల తర్వాత మరో 20 రోజులపాటు ప్రతి మండలంలో అన్ని గ్రామాల్లో బస్సు యాత్ర చేపడతామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మార్చి 27వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో లక్షల మందితో ‘సింహగర్జన’ భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. ఆ సభకు ముఖ్య అతిథిగా చంద్రబాబు (chandrababu) హాజరవుతారని కాసాని వెల్లడించారు.