TG: చంచల్గూడ జైలులో ఉన్న రిమాండ్ ఖైదీ అమీర్ హుస్సేన్ పరారయ్యాడు. చోరీ కేసులో ఈనెల 19న జైలుకు వచ్చిన అతడు, మేకులు మింగడంతో చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పోలీసుల కళ్లు గప్పి అతడు తప్పించుకున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు చిలకలగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.