IPL 2026కు దూరమవ్వడంపై RCB పేసర్ యశ్ దయాల్ తొలిసారి నోరు విప్పాడు. ‘టాక్ విత్ మన్వేంద్ర’ పోడ్కాస్ట్లో మాట్లాడుతూ..ఈ సీజన్ ఆడకూడదనేది తన వ్యక్తిగత నిర్ణయం కాదని, యాజమాన్యమే ఆ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశాడు. RCB మ్యాచ్లు చూస్తుంటే చాలా మిస్ అవుతున్నట్లు తెలిపాడు. అయితే జట్టుతో తనకు ఇప్పటికీ మంచి కమ్యూనికేషన్ ఉందని దయాల్ పేర్కొన్నాడు.