SRPT: పొరపాట్లు లేకుండా జనగణన-2027ను సకాలంలో పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ హనుమంతరెడ్డి ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయంలో ఫీల్డ్ ట్రైనర్లు, సూపర్వైజర్లతో ఆయన సమీక్షించారు. ఎన్యూమరేటర్లు తెచ్చే డేటాను, సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడీలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ప్రజలు సిబ్బందికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఛార్జ్ ఆఫీసర్ బుచ్చిబాబు పాల్గొన్నారు.