PLD: సత్తెనపల్లి సబ్జైలు నుంచి జీవిత ఖైదీ శ్రీనివాసరావు పరారైన ఘటన కలకలం రేపింది. GNTR హత్య కేసులో ముద్దాయి, జైలు పరిధిలోని పెట్రోల్ బంక్లో పనిచేస్తూ సోమవారం సాయంత్రం డ్యూటీ సమయంలో తప్పించుకున్నట్లు జైలు అధికారి వెంకటరత్నం తెలిపారు. ఈ ఘటనపై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న ఖైదీని పట్టుకునేందుకు ముమ్మర చర్యలు చేపట్టారు.