ఖమ్మం జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. టేకులపల్లి వంతెన వద్ద వాహనాల తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించిన వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, రెండు బైకులు, రెండు ఆటోలు దొంగిలించినట్లు ఒప్పుకున్నారని టూ టౌన్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలించారు.