ATP: గుత్తి మండలంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. మండల పరిధిలోని లచ్చన్న పల్లి గ్రామంలో 20 వైసీపీ కుటుంబాలు గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సమక్షంలో టీడీపీలోకి చేరాయి. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థ ఎన్నికలలో ప్రతి ఒక్కరు పార్టీ కోసం కృషిచేసి ప్రతి మండలంలో టీడీపీ జెండాను ఎగరవేయాలని సూచించారు.