TG: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ చేపట్టిన ‘రైతు గోస యాత్ర’పై ప్రభుత్వ విప్ వేముల వీరేశం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నేతలు రైతుల పేరుతో పసలేని, పనికిమాలిన యాత్రలు చేస్తూ రాజకీయం చేయడం మానుకోవాలని హితవు పలికారు. కమలం నేతలు యాత్రలు చేయాల్సింది రాష్ట్రంలో కాదని, ఢిల్లీలో అని ఎద్దేవా చేశారు.