రెస్టరెంట్లలో ఆహారం నాలుకకు రుచినిచ్చినా, ఆరోగ్యానికి ముప్పే. అక్కడ వాడే నాణ్యత లేని నూనెలు, మితిమీరిన ఉప్పు, కారం, టేస్టింగ్ సాల్ట్ జీర్ణక్రియను దెబ్బతీస్తాయి. ఫలితంగా గ్యాస్, ఎసిడిటీ, ఊబకాయం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. నిల్వ ఉంచిన చికెన్, మసాలాల వల్ల ఫుడ్ పాయిజనింగ్, విరేచనాలు అవుతాయి. కాబట్టి బయట తినడం తగ్గించి, ఇంటి భోజనానికే ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో మంచిది.