WNP: త్వరలో సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లా సందర్శించి సాగు, తాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై సమీక్షించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు ఇరిగేషన్ అధికారులు ప్రాతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మంగళవారం ఇరిగేషన్ అధికారులతో ఆయన సమీక్షించి, పెండింగ్ పనులను వేగం పెంచాలన్నారు.