HYD: రాష్ట్ర డీజీపీ కార్యాలయంలోని వివిధ విభాగాలను డీజీపీ సీ.వీ.ఆనంద్ ఐపీఎస్ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యాలయాల్లో పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందేలా అన్ని శాఖలు సమర్థవంతంగా పనిచేయాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. విధుల్లో క్రమశిక్షణ, సమన్వయం కీలకమని డీజీపీ పేర్కొన్నారు.