MDCL: సురక్షిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా మీ సురక్ష యాప్‌పై మల్కాజ్గిరి పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు సీపీ బి. సుమతి తెలిపారు. కమిషనరేట్ పరిధిలో అధికారులు, పోలీసు సిబ్బంది ఇంటింటికీ వెళ్లి గృహ సహాయకుల వివరాలను యాప్‌లో నమోదు చేయాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరించారు. చిన్న జాగ్రత్త పెద్ద నేరాలను అడ్డుకుంటుందని పోలీసు అధికారులు పేర్కొన్నారు.