ELR: నూజివీడు మండలం దిగవల్లి గ్రామానికి చెందిన దుమ్మనబోయిన తిరుపతమ్మ(65) వడగాడ్పులకు సోమవారం సాయంత్రం మృతి చెందారు. మంగళవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మృతురాలి భర్త సత్యనారాయణ రెండేళ్ల క్రితం అనారోగ్య కారణంగా మృతి చెందారు. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ సంఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.