PDPL: ఎండ తీవ్రత దృష్ట్యా కార్మికుల శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని పారిశుద్ధ్య కార్మికుల పని వేళలు సవరిస్తున్నట్లు రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి సోమవారం తెలిపారు. ఎండ బారిన పడకుండా నగర పాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులు ఉదయం 11 గంటల లోపు విధులు ముగించాలని అన్నారు. ఇటీవల వడ దెబ్బ బారిన వరుసమరణాలు సంభవిస్తుండడంతో పని వేళలు మార్చినట్టు తెలిపారు.