KMM: మధిర తహసిల్దార్ కార్యాలయం ఎదుట నేడు సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజ్ మిర్చి రైతులు భారీ ధర్నా నిర్వహించారు. అగ్ని ప్రమాదానికి గురైన మిర్చి రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజీ మిర్చి రైతుల బాధితుల లిస్టు వెంటనే ఇవ్వాలని అన్నారు. కష్టపడి పండించిన పంట బూడిద పాలు అయితే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని అన్నారు.