TG: పంట కొనుగోలులో ప్రభుత్వం విఫలం అయిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మిషన్ మోడ్‌లో వడ్లు కొనాలని సీఎం రేవంత్ అంటున్నారని గుర్తు చేశారు. రేవంత్‌ది మిషన్ మోడ్ కాదని.. కమీషన్ మోడ్ అని ఎద్దేవా చేశారు. ఢిల్లీ ట్రిప్పులు మాని.. లారీల ట్రిప్పులు పెంచాలని సూచించారు. రెండు రోజుల్లో మార్పు రాకుంటే కలెక్టరేట్ దగ్గర నిరవధిక ధర్నా చేస్తామని హెచ్చరించారు.