KDP: నాగులకట్ట వీధిలో లక్ష్మీదేవి అనే మహిళ భర్త చేతిలో గొడ్డలి దాడికి గురై చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. పోలీసులు వివరాల ప్రకారం గత సోమవారం లక్ష్మిదేవిపై ఆమె భర్త గొడ్డలితో తీవ్రంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమించింది. ఆమెను మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది.