KNR: ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ ఎస్సీ సెల్ జాతీయ సమావేశంలో మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడారు. ఎస్సీల సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనన్నారు. కాంగ్రెస్సేతర రాష్ట్రాల్లో దళితులకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ కట్టుబడి ఉందని అన్నారు.