WGL: ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభమైన ఇంటర్ సప్లిమెంటరీ ప్రాక్టికల్ పరీక్షలు ముగిసినట్లు వరంగల్ DIEO డా. శ్రీధర్ సుమన్ తెలిపారు. నగరంలోని పలు కళాశాలల్లో నిర్వహించబడుతున్న జనరల్, ఒకేషనల్ ప్రయోగ పరీక్షలను డీఐఈఓ పర్యవేక్షించారు. ఈ నెల 29వ తేదీన పర్యావరణ పరీక్ష ఉంటుందని, విద్యార్థులు తాము చదివిన కళాశాలల్లోనే ఈ పరీక్షలకు హాజరు కావాలని DIEO సూచించారు.