WNP: తల్లితో పాటు మూడేళ్ల కుమారుడు కనిపించకుండా పోవడంతో కేసు నమోదు చేశామని పట్టణ ఎస్సై హరిప్రసాద్ తెలిపారు. బండారునగర్ చెందిన ఊర్మిళ తన మూడేళ్ల కుమారుడితో ఆదివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లారు. భర్త ఏర్పుల మహేశ్ వచ్చి చూడగా ఆమె చరవాణి ఇంట్లోనే కనిపించింది. ఆచూకీ లభించక పోవడంతో భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.