MLG: ములుగుకు చెందిన బీజేపీ సీనియర్ కార్యకర్త ప్రమోద్ రెడ్డి(49) వడదెబ్బ ప్రభావంతో మృతి చెందారు. రెండ్రోజుల క్రితం అస్వస్థతకు గురైన ఆయనను చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా, ఆదివారం పరిస్థితి విషమించడంతో హనుమకొండకు తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూశారు. ఆయన మృతిపై బీజేపీ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.