ATP: జిల్లాలో ఇంధన ధరలు మళ్లీ భారీగా పెరగడంతో సామాన్య ప్రజలపై అదనపు భారం పడింది. లీటర్ పెట్రోల్‌పై రూ. 2.86 పైసలు పెరగడంతో ప్రస్తుత ధర రూ.117.09కు చేరింది. పెట్రోల్‌తో పాటు డీజిల్ ధర సైతం లీటర్‌కు రూ.2.83 పైసలు అదనంగా పెరిగింది. ఈ పెంపుతో లీటర్ డీజిల్ ధర రూ .104.80కు చేరుకుంది. ధరల పెరుగుదలపై సామాన్య ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.