NGKL: కల్వకుర్తిలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికల్లో తెల్కపల్లి మండలం ఆలేరు విద్యార్థిని భారతి ప్రతిభ చాటింది. అండర్-20 విభాగంలో 100 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందెంలో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానానికి ఎంపికైంది. దీంతో వచ్చే నెల 11, 12 తేదీల్లో హైదరాబాద్ ఓయూలో జరగనున్న 12వ తెలంగాణ స్టేట్ జూనియర్ ఛాంపియన్షిప్లో పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు.