SRD: కంగ్టి మండలం నాగంపల్లి గ్రామంలో 8 ఏళ్ల చిన్నారికి కీర్తిక మృతి చెందిన ఘటనపై మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నాగమణి ఇవాళ సాయంత్రం సందర్శించి విచారించారు. చిన్నారి తల్లిదండ్రులు కవిత, సంజీవ్లతో మాట్లాడి, చిన్నారి రిపోర్ట్స్ పరిశీలించారు. అయితే ఫీవర్ తీవ్రం కాగా సంగారెడ్డి ఆసుపత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించి చిన్నారి మృతి చెందిందని ఆమె తెలిపారు.