SDPT: సామాజిక న్యాయం, రాజ్యాధికార సాధనే లక్ష్యంగా జూన్ 5న సిద్దిపేటలో నిర్వహించే బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ బహిరంగ సభను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. బెజ్జంకిలో కరపత్రాన్ని ఆవిష్కరించి, జనాభా నిష్పత్తి ప్రకారం అన్ని రంగాల్లో సమాన వాటా కల్పించాలని డిమాండ్ చేశారు. సభకు విశారదన్ మహారాజ్ హాజరుకానున్నారు.