MBNR: హైదరాబాద్-బెంగళూరు హైస్పీడ్ రైలు ప్రాజెక్టు అలైన్మెంట్లో కీలక మార్పులు జరిగాయి. మొదట మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్ మీదుగా కర్నూలుకు వెళ్లాల్సిన ఈ రూట్‌ను, ఇప్పుడు శంషాబాద్, మన్ననూర్, సోమశిల మీదుగా మార్చారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు నేషనల్ హైస్పీడ్ రైల్ కారిడార్ లిమిటెడ్ (NHSRCL) ఈ కొత్త మార్పులు చేసినట్లు అధికారులు వెల్లడించారు.