TG: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాజీమంత్రి హరీష్ రావుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటున్నారు.. బీఆర్ఎస్లో ఆయన ఫ్యూచరేంటో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. రాష్ట్రం కోసం ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని.. బీఆర్ఎస్కు ఫ్యూచర్ లేదని విమర్శించారు. ఫ్యూచర్ సిటీకి తిరుగులేదని ధీమా వ్యక్తం చేశారు.