NZB: రైతులు రసాయన ఎరువులు వాడకం తగ్గించాలని శాస్త్రవేత్త డాక్టర్ ఇందుధర్ రెడ్డి అన్నారు. సిరికొండ మండలం చిమన్ పల్లి గ్రామంలో ప్రజా పాలన… ప్రగతి ప్రణాళికలో భాగంగా ‘రైతు ముగింట్లో శాస్త్రవేత్త’ అనే కార్యక్రమం నిర్వహించారు. రైతులు సేంద్రీయ ఎరువులు వేసుకుంటే భూసారం పెరిగి దిగుబడి వస్తుందని అన్నారు. వ్యవసాయ అధికారుల సూచనలు పాటించి సాగు చేసుకోవాలని సూచించారు.