HNK: కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్క్ఫెడ్ ద్వారా మక్కల కొనుగోలు వేగంగా కొనసాగుతోందని ఇవాళ AMC ఛైర్మన్ తౌటం ఝాన్సీరాణి రవీందర్ తెలిపారు. ఏప్రిల్ 22 నుంచి ఇప్పటివరకు 620 మంది రైతుల నుంచి 25,500 క్వింటాళ్ల మక్కలను కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గోదాములు, రవాణా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు.