AP: కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు స్వేచ్ఛగా బతుకుతున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కల్పించింది ఎన్డీయే పార్టీ. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. గొడ్డలి పార్టీ బుద్ధి మారట్లేదు. ప్రజాస్వామ్యంలో గొడ్డలి పార్టీకి చోటు లేదు. మనమిత్ర, వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. నేను ప్రజలకు సేవకుణ్ని.. పెత్తందారు కాదు’ అని పేర్కొన్నారు.