MHBD: కేసముద్రం మండలానికి చెందిన దంపతులు కుటుంబ కలహాలతో విడిగా ఉంటూ వివాదం కోర్టులో పెండింగ్లో ఉండగా, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మధ్యవర్తిత్వంతో మళ్లీ ఒక్కటయ్యారు. శుక్రవారం వీరి మధ్య ఉన్న వివాదంపై మహబూబాబాద్ కోర్టు మెజిస్ట్రేట్ కృష్ణతేజ్ సూచన మేరకు మధ్యవర్తిత్వ కేంద్రంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. దీంతో ఇరువురు కలిసి జీవించేందుకు అంగీకరించారు.