కృష్ణా: తోట్లవల్లూరు(M) వల్లూరుపాలెం వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ- అవనిగడ్డ కరకట్ట రహదారిపై బైక్‌ని వెనుక నుంచి టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఉయ్యూరుకు చెందిన ఉడుముల కృష్ణకు తీవ్ర గాయాలు కాగా ఆయన రెండు కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. క్షతగాత్రుని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.