KDP: పదో తరగతి రీవెరిఫికేషన్/రీవాల్యుయేషన్ ఫలితాల కోసం వేచిచూడకుండా ఆర్జీయూకేటీ 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కన్వీనర్ అమరేంద్ర కుమార్ సండ్రా తెలిపారు. దరఖాస్తుల చివరి తేదీ మే 30 కాగా, మార్కుల్లో మార్పులు వచ్చినా సవరించిన మార్కులనే పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యార్థులు గడువులోపు దరఖాస్తులు సమర్పించాలన్నారు.