MHBD: ఎండల తీవ్రత నేపథ్యంలో రైతులు, హమాలీలు, గుమస్తాలు, వ్యాపారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈనెల 23 నుంచి 31 వరకు మార్కెట్ కార్యకలాపాలకు సెలవులు ప్రకటించినట్లు కేసముద్రం వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ గంటా సంజీవరెడ్డి తెలిపారు. ఇందులో సాధారణ సెలవులతో పాటు కార్మికుల కోరిక మేరకు సెలవులు ఇచ్చామని, తిరిగి జూన్ 1నుంచి మార్కెట్ ప్రారంభమవుతుందన్నారు.