NRPT: కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కృష్ణవేణికి తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ ద్వారా మంజూరైన స్కూటీని కాంగ్రెస్ నాయకుడు రమేశ్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.