E.G: “ఆపరేషన్ క్లీన్ స్వీప్” పేరిట నేటి నుంచి జూన్ 20 వరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. శనివారం మున్సిపల్ కార్యాలయం నుంచి గోదావరి రైల్వే స్టేషన్ వరకు “ఆపరేషన్ క్లీన్ స్వీప్” ర్యాలీని కలెక్టర్ నిర్వహించారు. పరిశుభ్రమైన రాజమండ్రి నిర్మాణమే తన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.