WNP: పంట పొలాల్లో వరి కొయ్యలు, వ్యర్ధాలను నిప్పు పెట్టడం వల్ల భూసారం తగ్గడమే కాకుండా,రైతులకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లుతుందని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి హెచ్చరించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. వడగాల్పులు వల్ల మంటలు వేగంగా వ్యాపించి ప్రమాదాలకు దారితీస్తున్నాయని అన్నారు. వ్యర్ధాలను కాల్చకుండా భూమిలో కలియదున్ని సేంద్రియ ఎరువుగా వాడుకోవాలని తెలిపారు.