ఖమ్మం జిల్లాలో శుక్రవారం వడదెబ్బతో వివిధ ప్రాంతాలకు ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఏపీకి చెందిన వెంకన్న ఖమ్మంలో మృతిచెందాడు. అటు కూసుమంచి (మం) మంగళితండాలో ఇద్దరు రాములు, కేస్లీ, చింతకాని (మం) పాతర్లపాడులో భద్రమ్మ, అలాగే కొణిజర్ల మండల కేంద్రానికి చెందిన పాముల శ్రీను అనే వ్యక్తి ఉపాధి పనికి వెళ్లి అక్కడ అస్వస్థతకు గురై మృతిచెందాడు.