MDCL: చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి రాత్రిపూట ప్రయాణికులు క్యాబ్ ఖర్చులతో ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి బస్సులు అందుబాటులో లేకపోవడంతో, కొద్ది దూరానికే రూ.300 నుంచి రూ.400 వరకు వెచ్చించాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోయారు. సికింద్రాబాద్ తరహాలోనే చర్లపల్లి స్టేషన్ నుంచి కూడా 24 గంటల పాటు బస్సు సర్వీసులు నడపాలని వారు సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు.