HYD: రూ.1,100 కోట్ల వ్యయంతో నిర్మించిన 1000 పడకల సనత్నగర్ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ట్రయల్ రన్ కొనసాగుతోంది. 22 ఎకరాల్లో విస్తరించిన ఈ ఆసుపత్రిలో 16 మేజర్ ఆపరేషన్ థియేటర్లు, 300 ఐసీయూ బెడ్లు, 500 జనరల్ వార్డులు, 200 ప్రైవేట్ గదులు అందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక ఎంఆర్ఐ, 128 స్లైస్ సీటీ స్కాన్, క్యాథ్ ల్యాబ్స్, ఆక్సిజన్ ప్లాంట్ ఉన్నాయి.