ఒడిశాలో విచిత్రం జరిగింది. 12వ తరగతి (CHSC) పరీక్షల్లో విశ్వజీత్ అనే విద్యార్థికి ఇంగ్లీష్ పేపర్లో వందకు ఏకంగా 102 మార్కులు వచ్చాయి. ఇది చూసి అందరూ షాకవ్వగా, పేపర్ల వాల్యుయేషన్ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఇది కంప్యూటర్ తప్పిదం వల్ల జరిగిందని, ఒక వారంలోగా ఈ తప్పును సవరించి కొత్త మార్కుల జాబితాను అందిస్తామని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు.