సత్యసాయ: పుట్టపర్తి నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం నల్లమాడ ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, కలెక్టర్ శ్యాంప్రసాద్, ఆర్డీవో సువర్ణ పాల్గొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన వివిధ ఫిర్యాదులను స్వయంగా స్వీకరించి, వాటి పరిష్కారానికి తగిన మార్గాలు చూపారు.