TG: నిమ్స్ వైద్య బృందానికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్స్‌లో అరుదైన మైలురాయిని నిమ్స్ వైద్యులు అందుకున్నారు. నిమ్స్ యూరాలజీ విభాగం ఇప్పటివరకు 2 వేల కిడ్నీ మార్పిడిలు పూర్తి చేసింది. కిడ్నీ మార్పిడిల్లో దక్షిణ భారత్‌లో నంబర్ వన్‌గా నిమ్స్ నిలిచింది. అరుదైన మైలురాయి సాధించి బాధితులకు విశేష సేవలు అందించింది.