TPT: తిరుచానూరు ఫ్లైఓవర్ నుంచి దామినేడు వరకు హైవే విస్తరణ వల్ల ఏర్పడిన డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి వారంలోపు స్పష్టమైన ప్రతిపాదనలు పంపాలని సూచించారు. డ్రైనేజీ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం చూపే పనుల కోసం అవసరమైన నిధులను మంజూరు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.