అన్నమయ్య: చిట్వేలు ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు, శానిటేషన్ సమస్యలపై వైద్య అధికారి డాక్టర్ శివప్రసాద్ సీహెచ్ఎస్ సభ్యులు చర్చించారు. సంస్థ సభ్యులు ఇంతియాజ్, శివారెడ్డి, బొంతల నాగేశ్వరరావుతో పాటు సభ్యులు పాల్గొన్నారు. గతంలో ఆసుపత్రి అభివృద్ధికి లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు పేర్కొంటూ, గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం ఎల్లప్పుడూ సహకరిస్తామన్నారు.