NDL: డోన్ పట్టణంలోని పాతపేట ప్రభుత్వ వైద్యశాల పునఃప్రారంభంతో ఉపయోగం లేదని, ప్రజలు ఎదుర్కొంటున్న రెండు రైల్వే గేట్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే కోట్లకు సీపీఎం పట్టణ కార్యదర్శి నక్కి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. రైల్వే గేట్లు మూసివేసిన సమయంలో విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, అత్యవసర సేవలకు వెళ్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వారు అన్నారు.