GNTR: తెనాలి-గుంటూరు మార్గంలోని ఫ్లైఓవర్ కింద శుక్రవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం జరిగింది. చెంచుపేట నుంచి రైల్వే స్టేషన్ వెస్ట్ బుకింగ్ కౌంటర్‌కు వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన ఉన్న వ్యర్థాలకు నిప్పు అంటుకుని ప్రమాదం సంభవించింది. మంటలు వ్యర్ధాలు, పైపులకు అంటుకుని బ్రిడ్జిపై వరకు ఎగసిపడటంతో అటుగా వెళుతున్న వారు భయాందోళనకు గురయ్యారు.